Babu Mohan: అప్పుడు వాణిశ్రీగారు కోటన్నపై కోప్పడ్డారు: బాబూ మోహన్

Babu Mohan Interview
  • కోటన్న ఎంతో గొప్ప నటుడు 
  • ఆయనతో చేసిన ఫస్టుమూవీ 'బొబ్బిలి రాజా'
  • 'మామగారు' నుంచి మా జోడీ పాప్యులర్ అయింది 
  • ఒకానొక దశలో తాము లేని సినిమా లేదన్న బాబూ మోహన్

పాత రోజుల్లో రేలంగి - రమణారెడ్డి కలిసి వెండితెరపై ఎంత సందడి చేశారో, ఆ తరువాత కాలంలో రావు గోపాలరావు - అల్లు రామలింగయ్య అంతటి అల్లరి చేశారు. వాళ్ల తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన జంట ఏదైనా ఉందంటే అది కోట శ్రీనివాసరావు - బాబూ మోహన్ అనే చెప్పాలి. ఒకానొక దశలో ఈ జంట కనిపించని సినిమా ఉండేది కాదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి తమ కాంబినేషన్ గురించి .. కోటతో తనకి గల అనుబంధాన్ని గురించి 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబూ మోహన్ చెప్పారు. 

"ఒక వైపున నేను .. మరో వైపున కోటన్న ఎవరి సినిమాలం వాళ్లు చేసుకుంటూ వెళుతున్నాము. అప్పుడు ఇద్దరి మధ్య పెద్ద పరిచయం కూడా ఉండేది కాదు. అలాంటి సమయంలో ఇద్దరం కలిసి 'బొబ్బిలి రాజా' సినిమా చేశాము. అప్పుడే మా మధ్య  పరిచయం జరిగింది. ఆ తరువాత కొంత కాలానికి వచ్చిన 'మామగారు' సినిమా నుంచి మా కాంబినేషన్ హైలైట్ అయింది. అప్పటి నుంచి మేమిద్దరం బిజీ అయ్యాము. ఆయన గొప్ప నటుడు .. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని అన్నారు. 

'బొబ్బిలి రాజా' సినిమా షూటింగు సమయంలో కోటన్న సరదాగా నన్ను ఏదో అన్నారు. ఆ మాటను వాణిశ్రీగారు విన్నారు. నన్ను ఆయన ఏదో సతాయిస్తున్నాడని ఆమె అనుకున్నారు. 'ఏంటి ఆయనను బెదిరిస్తున్నావ్ .. సీనియర్ ననా. నేను కూడా నీ కంటే సీనియర్ నే. మరి నేను కూడా నిన్ను ఏడిపించవచ్చును గదా. ఇంకొక సారి ఆయనను ఏమైనా అంటే నిన్ను వదిలిపెట్టను" అన్నారు. అప్పటి నుంచి ఆయన నన్ను ఏమీ అనేవారు కాదు" అని చెప్పారు.

Babu Mohan
Kota Srinivasa Rao
Vanisri
రేలంగి రమణారెడ్డి
Telugu Comedians
Telugu Cinema
Bobbili Raja
Mamagaru movie
Telugu Film Industry
Comedy Actors

More Telugu News