Pawan Kalyan: రవితేజ తండ్రి మృతికి సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Expresses Condolences on Ravi Tejas Fathers Demise
  • రవితేజకు పితృవియోగం
  • గతరాత్రి హైదరాబాదులో కన్నుమూసిన రాజగోపాల్ రాజు
  • ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
టాలీవుడ్ హీరో రవితేజకు పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి హైదరాబాదులో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 

"రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. రాజగోపాల్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రవితేజ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అంటూ సంతాప సందేశం వెలువరించారు.

Pawan Kalyan
Ravi Teja
Rajagopal Raju
Telugu cinema
Tollywood
Condolences
Death
Andhra Pradesh
Deputy CM

More Telugu News