West Godavari Woman Assault: మహిళను చెట్టుకు కట్టేసి దాడి... పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

West Godavari Woman Tied to Tree and Attacked
  • భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని భార్య ఆరోపణ
  • మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన భార్య, బంధువులు
  • దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని మోగల్లులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆయన భార్య, భార్య బంధువులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు. నిన్న రాత్రి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. 

ఈ దాడి ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాధితురాలిని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవివర్మ తెలిపారు.
West Godavari Woman Assault
West Godavari
Woman Assault
Palakoderu
Mogallu
Extra marital affair
Andhra Pradesh crime
Viral video

More Telugu News