Mogallu Incident: అక్రమ సంబంధం ఆరోపణలతో మహిళపై దాడి.. మోగల్లులో దారుణం

Woman Assaulted in Mogallu Over Extramarital Affair Claims



వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లుకు చెందిన ఓ మహిళపై నిన్న దాడి జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని మరో మహిళ తన బంధువులతో కలిసి ఈ దాడికి పాల్పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా బాధితురాలిని చెట్టుకు కట్టేసి చితకబాదింది.

మంగళవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ దాడి కొనసాగింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మహిళను, ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mogallu Incident
West Godavari Crime
Extramarital Affair
Woman Assaulted
Palakoderu Mandal
Andhra Pradesh Police
Viral Video
Domestic Violence
Crime News Andhra Pradesh
Mogallu Village

More Telugu News