కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో.. తిరిగి జట్టులోకి రా: మదన్ లాల్
- లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన భారత్
- ఈ ఓటమి తర్వాత కోహ్లీకి మదన్ లాల్ కీలక అభ్యర్థన
- రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవడంలో తప్పు లేదన్న మాజీ క్రికెటర్
- కోహ్లీ తన అనుభవాలను యువకులతో పంచుకోవాలని సూచన
"భారత క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీకి ఉన్న మక్కువ అసమానమైంది. రిటైర్మెంట్ తర్వాత అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావాలని నా కోరిక. తిరిగి రావడంలో తప్పు లేదు. ఈ సిరీస్‌లో కాకపోయినా తదుపరి సిరీస్‌లో అతను తిరిగి రావాలి.
నా దృష్టిలో అతను తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే అతను మరో 1-2 సంవత్సరాలు సులభంగా ఆడగలడు. ఇది విరాట్ తన అనుభవాన్ని యువకులకు అందించడంలో సహాయపడుతుంది. ఇంకా ఆలస్యం కాలేదు. దయచేసి తిరిగి రండి" అని మదన్ లాల్ క్రికెట్ ప్రిడిక్టాతో అన్నాడు.