Chilakapalli Nagamani: కొవ్వూరులో మహిళ హైడ్రామా.. దగ్గరికొస్తే గోదావరిలో దూకుతానని బెదిరింపు

Woman Attempts Suicide in Kovvur Due to Missing Daughter Stress
  • నాలుగు నెలల క్రితం కుమార్తె అదృశ్యం
  • ఈ ఘటనతో మనస్తాపం చెందిన మహిళ
  • అర్ధరాత్రి ఒంటిగంటకు కొవ్వూరు రోడ్ కం రైలు వంతెనపైకి
  • గడ్డర్‌పై ఏడు గంటలపాటు ప్రమాదకరంగా కూర్చున్న వైనం
  • నిన్న తెల్లవారుజామున 7.45 గంటలకు గోదావరిలోకి దూకిన మహిళ
  • రక్షించిన ఈతగాళ్లు.. మహిళ మానసిక స్థితిపై అనుమానం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఓ మహిళ దాదాపు ఏడు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించింది. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చిలకపల్లి నాగమణి సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన ట్రాక్‌పైకి చేరుకుని గడ్డర్‌పై ప్రమాదకరంగా కూర్చుంది. గమనించిన రైల్వే సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను గడ్డర్‌పై నుంచి కిందికి రప్పించే ప్రయత్నం చేశారు. అయితే, తన దగ్గరకు ఎవరైనా వస్తే దూకేస్తానని ఆమె బెదిరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత తన పేరు నాగమణి అని, దుద్దుకూరు హైస్కూలు వీధిలో ఉంటానని వివరాలు చెప్పింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి స్థానికులను తీసుకొచ్చారు. అలాగే కాకినాడ నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక జాలర్లను కూడా పిలిపించారు. గడ్డరప్‌పై చాలాసేపు అలానే కూర్చున్న నాగమణి నిన్న ఉదయం 7.45 గంటలకు గోదావరిలోకి దూకేసింది. వెంటనే అప్రమత్తమైన ఈతగాళ్లు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. 

నాగమణి పెద్ద కుమార్తె తండ్రితో ఉంటుండగా, చిన్న కుమార్తెతో కలిసి నాగమణి తల్లి వద్దే ఉంటోంది. కుమార్తె నాలుగు నెలల క్రితం అదృశ్యం కావడంతో నాగమణి ఒంటరైంది. దీంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Chilakapalli Nagamani
Kovvur
Godavari River
Suicide Attempt
Road cum Rail Bridge
East Godavari District
Duddukuru
Missing Daughter
Mental Stress
Andhra Pradesh Police

More Telugu News