Deepak Tilak: లోక్‌మాన్య తిల‌క్ మునిమ‌న‌వ‌డు దీప‌క్ తిల‌క్ క‌న్నుమూత‌

Deepak Tilak Lokmanya Tilaks Great Grandson Passes Away
  • పుణెలోని నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచిన దీప‌క్ తిల‌క్
  • కేస‌రి ప‌త్రిక‌కు ట్ర‌స్టీ ఎడిట‌ర్‌గా దీపక్ తిల‌క్ 
  • గ‌తంలో మ‌హారాష్ట్ర విద్యాపీఠంలో వైస్ ఛాన్స‌ల‌ర్‌గా బాధ్య‌త‌లు
లోక‌మాన్య బాల గంగాధ‌ర్ తిల‌క్ ముని మ‌న‌వ‌డు, మ‌రాఠీ భాష కేస‌రి ప‌త్రిక ట్ర‌స్టీ ఎడిట‌ర్ దీప‌క్ తిల‌క్ (78) ఈరోజు క‌న్నుమూశారు. పుణెలోని ఆయ‌న‌ నివాసంలో తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న వృద్ధ్యాప సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. 

ఇవాళ ఉద‌యం 8 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు తిల‌క్‌వాడ‌లో ఆయ‌న పార్దీవ‌దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం ఉంచ‌నున్నారు. వైకుంఠ శ్మ‌శాన‌వాటిక‌లో ఆయ‌న పార్దీవ‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. లోక్‌మాన్య తిల‌క్ 1881లో ప్రారంభించిన కేస‌రి ప‌త్రిక‌కు దీపక్ తిల‌క్ ట్ర‌స్టీ ఎడిట‌ర్‌గా పని చేస్తున్నారు. 

దీప‌క్ తిల‌క్ మ‌హారాష్ట్ర విద్యాపీఠంలో వైస్ ఛాన్స‌ల‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అలాగే అకడెమిక్, జ‌ర్న‌లిస్టు స‌ర్కిల్‌లో ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉంది. కాగా, దీపక్ తిల‌క్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Deepak Tilak
Lokmanya Tilak
Kesari Patrika
Marathi Journalism
Pune
Maharashtra Vidyapeeth
Bal Gangadhar Tilak
Indian Freedom Fighter
Marathi Newspaper

More Telugu News