Ravi Teja: రవితేజ తండ్రి మృతిపై చిరంజీవి స్పందన

Chiranjeevi Condolences to Ravi Teja on Fathers Demise
  • నిన్న రాత్రి కన్నుమూసిన రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు
  • మరణ వార్త ఎంతో బాధించిందన్న చిరంజీవి
  • 'వాల్తేరు వీరయ్య' సెట్ లో ఆయనను చివరిసారి కలిశానని వెల్లడి
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కోట శ్రీనివాసరావు, బి.సరోజాదేవి మరణ వార్తలు మరువకముందే... స్టార్ హీరో రవితేజ ఇంట విషాదం చోటుచేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు.

రవితేజ తండ్రి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త ఎంతో బాధించిందని చిరంజీవి అన్నారు. చివరిసారిగా ఆయనను 'వాల్తేరు వీరయ్య' సెట్ లో కలిశానని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

రాజగోపాల్ రాజు పార్థివదేహం ప్రస్తుతం రవితేజ నివాసంలో సందర్శనార్థం ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం రాయదుర్గం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు, రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు కాగా... పెద్ద కుమారుడు రవితేజ. మిగిలిన ఇద్దరు కుమారులు రఘు, భరత్ కూడా నటులే. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కుమారుడు భరత్ మరణించారు.
Ravi Teja
Raj Gopal Raju
Chiranjeevi
Tollywood
Waltair Veerayya
Raghunath Raju
Bharat Raju
Telugu Cinema
Death
Condolences

More Telugu News