Pratyusha: ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ వల్లే... డెంటిస్ట్ ఆత్మహత్యపై పోలీసులు ఏం చెప్పారంటే...!

Dentist Pratyusha Suicide Police Reveal Influencer Connection
  • డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో వివరాలు వెల్లడించిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
  • సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌‌తో భర్త సంబంధం వదులుకోనన్నందుకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న ఏసీపీ
  • ప్రత్యూష్ భర్త సృజన్, అత్తమామ, ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు వెల్లడి  
హసన్‌పర్తిలో డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్యకు గల కారణాలను కాజీపేట పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన ప్రత్యూష భర్త సృజన్, ఆయన తల్లిదండ్రులు, సృజన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాజీపేట ఏసీపీ పి. ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌తో ఏర్పడిన సంబంధాన్ని వదులుకునేది లేదని భర్త సృజన్ తేల్చి చెప్పడంతోనే డెంటిస్ట్ ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని ఏసీపీ తెలిపారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ప్రత్యూష, సృజన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి కుటుంబం హసన్‌పర్తిలోని కాకతీయ వింటేజ్ విల్లాస్‌లో స్థిరపడింది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రచారం కోసం యాజమాన్యం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ను పిలిపించారు. ఆ క్రమంలో ఆమెతో సృజన్‌కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అప్పటి నుంచి సృజన్ కుటుంబాన్ని పట్టించుకోకుండా, అర్ధాంగి ప్రత్యూషను మానసికంగా, శారీరకంగా వేధించాడు. భర్తతో పాటు అత్తమామలు, ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా ప్రత్యూషను వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే 13వ తేదీన ప్రత్యూష, సృజన్ మధ్య గొడవ జరిగింది. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని ప్రత్యూష పదేపదే చెప్పినా భర్త వినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.

అదే రోజు సాయంత్రం గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యూష తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రత్యూష భర్త సృజన్, అత్తమామలు, ఇన్‌ఫ్లూయెన్సర్ పోలీసుల దృష్టిలో పడకుండా తప్పించుకొని తిరిగారు.

అయితే నిన్న కాకతీయ వింటేజ్ విల్లాస్ వద్ద పోలీసులు గస్తీ కాస్తుండగా, ఈ నలుగురు కారులో అక్కడికి చేరుకున్నారు. దీంతో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులను పోలీసులు నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడంతో జైలుకు తరలించారు. 
Pratyusha
Dentist Pratyusha
Srujan
Social Media Influencer
Hasanparthy
Kakatiya Vintage Villas
Adultery
Suicide
Kazipet Police
Extramarital Affair

More Telugu News