Nara Lokesh: 'నైపుణ్యం పోర్టల్' ను సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండి: నారా లోకేశ్

Nara Lokesh Orders Launch of Naipunya Portal by September 1
  • యువత, పరిశ్రమలను అనుసంధానించేలా 'నైపుణ్యం పోర్టల్' 
  • ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో నారా లోకేశ్ మంత్రి సమీక్ష 
  • ఓంక్యాప్ ద్వారా యువతకు విదేశాల్లో అవకాశాలు కల్పించాలని సూచన
యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 'నైపుణ్యం పోర్టల్' ను ఆగష్టు నాటికి పూర్తిచేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. 

డిస్ట్రిక్ట్ ఎంప్లాయింట్ ఆఫీసర్ ను డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్ గా మార్చి.. వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓంక్యాప్ ద్వారా కల్పించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. 

అదేవిధంగా ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయక మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, లేదా వాట్సాప్ నెంబర్ 8500027678 ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల థాయ్ లాండ్ లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓంక్యాప్, ఎన్ఆర్ టి ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 

ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో జి.గణేశ్ కుమార్, కాలేజి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్ సీత శర్మ, ఏపీఎస్ఎస్ డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రఘు తదితరులు పాల్గొన్నారు. 
Nara Lokesh
Naipunya Portal
Skill Development
Job Melas
Employment Opportunities
Andhra Pradesh
Omcap
Foreign Employment
Skill Training

More Telugu News