KTR: విద్యార్థుల మరణాలకు రేవంత్ బాధ్యత వహించాలి: కేటీఆర్

KTR demands Revanth accountability for student deaths
  • ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వందకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్న కేటీఆర్
  • రేవంత్ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శ
  • విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపాటు
రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఘటనలకు, విద్యార్థుల మరణాలకు రేవంత్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తో అనారోగ్యం పాలయ్యారని, వందకు పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ కూడా ఆయన చేతిలోనే ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. 

కనీసం ఒక తండ్రిగానైనా రేవంత్ స్పందించాలని... పిల్లలు కలిగిన ఒక తండ్రిగా కోరుతున్నానని కేటీఆర్ అన్నారు. మీ పిల్లలకు విషం కలిపిన ఆహారాన్ని ప్రభుత్వం పెడితే మీరు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని... తగిన సమయంలో తీర్పు ఇస్తారని చెప్పారు. 
KTR
Revanth Reddy
Telangana
Food Poisoning
Student Deaths
BRS
Telangana Government
Education
Student Health

More Telugu News