Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తీరేంటో అర్థం కావడం లేదే!

Nidhi Agerwal Special
  • గ్లామర్ తో కట్టిపడేసిన నిధి అగర్వాల్ 
  • అవకాశాలపై అంతగా చూపని ఆసక్తి 
  • నిదానంగా సాగుతున్న కెరియర్ 
  • చేతిలో పవన్ - ప్రభాస్ ల సినిమాలు 

 వెండితెరపై కథానాయికగా మెరవాలనే ఆశ చాలామందికి ఉంటుంది. అందువలన ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక తమ గ్లామర్ కంటూ ఒక గుర్తింపు దక్కినాక, ఒక హిట్ అంటూ పడిన తరువాత మరింత జోరు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా స్టార్స్ సరసన సందడి చేయాలనీ .. సక్సెస్ లను అందుకోవాలని భావిస్తారు.

కానీ నిధి అగర్వాల్ విషయానికే వస్తే, ఆమెలో అలాంటి ఆరాటమే కనిపించకపోవడం ఆశ్చర్యం. 2018లోనే నిధి అగర్వాల్ పరిచయమైంది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగులో ఆమె చేసింది నాలుగు సినిమాలే. పోనీ మిగతా భాషలలో బిజీగా ఉండటం వలన అలా జరిగిందేమో అంటే, అలాంటిదేమీ లేదు. చక్కని కనుముక్కుతీరుతో కట్టిపడేసే ఈ సుందరి, టాలీవుడ్ ని ఏలేస్తుందని చాలామంది అనుకున్నారు. వాళ్ల అంచనాలతో తనకి సంబంధం లేదన్నట్టుగానే నిధి అగర్వాల్ ఉండిపోయింది. 

అవకాశాలు అందుకోవాలనే ఉత్సాహం .. ఉరుకులాట నిధి అగర్వాల్ కి ఎందుకు లేదనేది అర్థం కాదు. నిధి కంటే చాలా లేట్ గా వచ్చిన శ్రీలీల .. కృతి శెట్టి కూడా, ఆమె కంటే ఎక్కువ సినిమాలే చేశారు. ఇక ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే గట్టిపోటీని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే నిధి చేసిన 'హరిహర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత కొంత గ్యాప్ తో 'రాజా సాబ్' పలకరించనుంది. ఈ రెండూ కూడా మంచి ప్రాజక్టులే. మరి ఈ సినిమాలతోనైనా నిధి రేస్ లోకి అడుగుపెడుతుందేమో చూడాలి. 
Nidhhi Agerwal
Hari Hara Veera Mallu
Raja Saab
Sreeleela
Krithi Shetty
Bhagyashree Borse
Telugu cinema
Tollywood
Indian actress
movie releases

More Telugu News