Fake TTE: నరసరావుపేటలో నకిలీ టీటీఈ అరెస్ట్
- మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళుతున్న రైల్లో నకిలీ టీటీఈ
- నకిలీ టీటీఈని గుర్తించిన అసలు టీటీఈ
- నరసరావుపేట పోలీసుల అదుపులో నకిలీ టీటీఈ
పల్నాడు జిల్లాలో ఓ నకిలీ టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు జనరల్ బోగీల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా.... అదే రైల్లో తనిఖీలు నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన అసలు టీటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డాడు. నకిలీ టీటీఈని ఐడీ కార్డు చూపించాలని జాన్ వెస్లీ అడిగాడు. దీంతో జాన్ వెస్లీతో నకిలీ టీటీఈ వాదనకు దిగాడు. ఈ క్రమంలో రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు.