BEd Student Suicide Case: ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యకేసులో కీలక విషయం వెలుగులోకి..

Odisha BEd Student Suicide Victim Warned of Action Against HOD
  • హెచ్ఓడీ వేధింపులు భరించలేక ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థిని
  • 95 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పది రోజుల కిందే లేఖ
ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న బీఈడీ విద్యార్థిని వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హెచ్ఓడీ వేధింపులపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనను లైంగికంగా వేధించిన హెచ్ఓడీపై చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు పది రోజుల కిందే హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయంపై కళాశాల యాజమాన్యానికి లేఖ కూడా రాసినట్లు బయటపడింది. అయినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆమె స్నేహితురాళ్లు ఆరోపిస్తున్నారు.

బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కళాశాలలో బీఈడీ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 12 న ఆత్మహత్యాయత్నం చేసింది. బీఈడీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయంపై బాధితురాలు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ హెచ్ఓడీపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కళాశాలలో ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల 12న కళాశాల ప్రిన్సిపాల్ గది ముందు బైఠాయించింది. అనంతరం తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, బాధితురాలి శరీరం 95 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.
BEd Student Suicide Case
Odisha Student Suicide
Fakir Mohan College
HOD Harassment
Balasore
Student Protest
Sexual Harassment Complaint
College Management
Suicide Attempt

More Telugu News