India Cricket Team: ఇంగ్లండ్‌పై ఓడిన ఫలితం.. డబ్ల్యూటీసీ జాబితాలో నాలుగో స్థానానికి భారత్

India Drops to Fourth in WTC Standings After England Defeat
  • ఉత్కంఠ పోరులో 22 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్
  • డబ్ల్యూటీసీ జాబితాలో రెండు స్థానాలు దిగజారిన భారత్
  • ఈ విజయంతో రెండో స్థానానికి చేరుకున్న ఇంగ్లండ్
  • అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదో రోజు 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని, భారత్‌ను చివరి సెషన్‌లో 170 పరుగులకు ఆలౌట్ చేసింది.

ఈ ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సైకిల్‌ పట్టికలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. ఈ టెస్ట్‌కు ముందు 50 పాయింట్ల శాతం (పీసీటీ)తో ఉన్న ఇంగ్లండ్.. భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్ పీసీటీ 66.67కి పెరిగి శ్రీలంకతో సమానంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.

ఈ ఓటమితో భారత్ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఒకదాంట్లో విజయం సాధించిన భారత్ 33.33 పీసీటీతో నాలుగో స్థానానికి దిగజారింది.. బంగ్లాదేశ్, వెస్టిండీస్ మాత్రమే భారత్ కంటే దిగువన ఉన్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఇంకా పూర్తి సిరీస్ ఆడలేదు లేదా సిరీస్ మధ్యలో ఉన్నాయి, కాబట్టి ఆయా జట్ల స్థానాలు మార్పు కనిపించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో డబ్ల్యూటీసీ స్థానాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు.
India Cricket Team
England vs India
WTC Points Table
World Test Championship
India WTC Ranking
Cricket Rankings
Lords Test Match
Underdon Tendulkar Trophy
Test Cricket
ICC Test Championship

More Telugu News