BR Gavai: తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

BR Gavai Hospitalized with Severe Infection
  • ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీజేఐ జస్టిస్ గవాయ్
  • హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగివచ్చిన తర్వాత కనిపించిన ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
  • చికిత్స పొందుతున్న కారణంగా నిన్న విధులకు హాజరుకాని సీజేఐ జస్టిస్ గవాయ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వర్గాలు తెలియజేశాయి. చికిత్స పొందుతున్న కారణంగా ఆయన నిన్న విధులకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని, ఒకటి రెండు రోజుల్లో విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.

సీజేఐ గవాయి ఈ నెల 12న హైదరాబాద్‌లో పర్యటించారు. సల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలో ఆయన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ - రాజ్యాంగ సభ - భారత రాజ్యాంగం పేరిట ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.

హైదరాబాద్ పర్యటన ముగిసిన అనంతరం ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. జస్టిస్ గవాయి భారతదేశ 52వ సీజేఐగా మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది నవంబర్ 23న ఆయన పదవీకాలం ముగియనుంది. 
BR Gavai
Chief Justice of India
Supreme Court
Infection
Hospitalized
Delhi
Hyderabad
SALSAR University of Law
Justice Gavai
CJI

More Telugu News