Perni Nani: పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వంశీ ఇలా మాట్లాడే ఊచలు లెక్కబెట్టి వచ్చాడు: సోమిరెడ్డి

Somireddy Slams Perni Nani Comments on Chandrababu Naidu
  • గత కొన్నిరోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పేర్ని నాని
  • మంగళగిరిలో సోమిరెడ్డి ప్రెస్ మీట్
  • ఫైలుపై సంతకం పెట్టాలంటే నాని చెయ్యి వణుకుతుందని వెల్లడి
  • నువ్వా చంద్రబాబు వయసు గురించి మాట్లాడేదంటూ ఫైర్
  • లోకేశ్ ను ఒరే తురే అంటావా అంటూ ఆగ్రహం
  • రప్పా రప్పా అంటూ సినిమా తీసుకోవాలని వ్యంగ్యం
పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక కుట్ర దాగి ఉందని, టీడీపీని రెచగొట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయిస్తే తన కొడుకుకి కృష్ణా జిల్లా సామ్రాజ్యాన్ని అప్పగించాలని పేర్ని నాని పన్నిన పన్నాగమే ఇందంతా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని, పేర్ని నాని వాడిన భాష సరైనది కాదు అని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...“కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయి. కానీ వైసీపీ, జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు, చర్యల వలన రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. సినిమాల్లో రాజనాల కుట్రలు కుతంత్రాలు ఎలా ఉండేవో నేడు జగన్ రెడ్డి కుట్రలు అలా ఉంటున్నాయి. రాజకీయాల్లో విలువలు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? ప్రజలు ఛీ కొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు ఇలా మాట్లాడే వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్కపెట్టి బ్రతుకు జీవుడా అంటూ బయటకి వచ్చాడు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శాసనసభలో ఏమి స్క్రిప్టు ఇస్తే అది మీరు చదవాలి. అలా రాసి చదవమంటే నేను చదవను అని మాగుంట శ్రీనివాసులు పక్కకి నెట్టేశాడు. ఈరోజు పేర్ని నానిలాంటి వారు జగన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టును చదివేస్తూ ఘోరంగా మాట్లాడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు గారితో నువ్వు గాని, జగన్ రెడ్డి గాని నడవగలరా?

“చంద్రబాబు గారికి 76 ఏళ్లు అంటూ అవహేళన చేస్తావా పేర్ని నాని? నీకు అంత కొవ్వు పట్టిందా? ఆయనతో పాటు రామతీర్థం, అలిపిరి కొండ ఎక్కగలవా? అలిపిరి బాంబ్ బ్లాస్ట్‌ లో చావును చూసి తిరిగొచ్చి హీరోగా నిలిబడిన వ్యక్తి చంద్రబాబు గారు. మీ రాజ్యంలోనే అనపర్తిలో పోలీసులు చంద్రబాబు గారిని నిలువరిస్తే 7 కి.మీ నడిచారు. నాడు ఆయనతో పాటు పోలీసుల నడవలేకపోయారు. చంద్రబాబు పేరు చెబితేనే వణుకు వచ్చే వ్యక్తి పేర్ని నాని. ఏ ఫైలు మీదనైనా సంతకం పెట్టాలంటే పేర్ని నానికి చెయ్యి వణుకుతుంది. 40 ఏళ్లు రాగానే నాపని అయిపోయింది, నా కొడుకును పెట్టుకుంటానని తప్పించుకున్న నువ్వు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతావా? సబ్జెక్ట్ పరంగా గాని, విజన్ పరంగా గాని ఎలా చూసుకున్న చంద్రబాబు గారి ప్రక్కన జగన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా కూర్చోలేడు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గారిని ఒరే తురే అంటావా? నోరు అదుపులో పెట్టుకో!” అని హెచ్చరించారు.

రప్పా రప్పా అంటూ సినిమా తీయండి

“నాడు వల్లభనేని వంశీ, కొడాలి నాని... నేడు పేర్ని నాని, ప్రసన్న కుమార్ రెడ్డిలకు ఏమైంది? రాష్ట్రాన్ని అరాచకరాజ్యంగా మార్చాలని వైసీపీ చూస్తుంది. గంగమ్మ తిరునాళ్ళలో పొట్టేలు తలలు నరికినట్లు రప్పా రప్పా నరకాలా అని ప్లేకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటని జగన్ రెడ్డి మాట్లాడాడు. వైసీపీ ఆలోచనలు ఏంటో రప్పా రప్పా అని బూతుల డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మచేత సినిమా తీయించండి. రాజకీయాల్లో పేర్ని నాని లాంటి వారిని చూసి మేము రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు దురభిప్రాయాన్ని ఏర్పడేడట్లు వైసీపీ చేసింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతోమంది మహానేతలు రాష్ట్రపతి, ప్రధానులు అయ్యారు. అలాంటి రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిలాంటి రాజకీయ ఉన్మాదులను చూస్తుంటే నవ్వాలో ఏడవాల్లో తెలయడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అంతపెద్ద హీరోలు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడికి పోయి దాక్కున్నారు?” అని ప్రశ్నించారు.

దేశ ప్రధానికే చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు

చంద్రబాబు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. పక్క రాష్ట్రాలు చంద్రబాబు గారి విజన్‌ను చూసి నేర్చుకుంటున్నాయి. సాక్షాత్ దేశ ప్రధానే చంద్రబాబు చేస్తున్న ఐటీ అభివృద్ధుని చూసి నేను గుజరాత్‌లో అమలు చేశాను అని అన్నారు. జగన్ రెడ్డి ఏమి చేశాడో ఒక్కటి చెప్పండి. ఏదైనా ఉందా అంటే బాబాయిని చంపడం, తల్లి చెల్లిని గెంటేయడం, ఇంకో చెల్లి నా తండ్రిని చంపిన వారి పేర్లన్ని ఉన్నాయి అరెస్ట్ చేయండని కోర్టు చుట్టు తిరగడం. ఇటువంటి రక్త చరిత్ర ఉన్నవ్యక్తి దేశంలో ముఖ్యమంత్రిగా చేసిన వారి చరిత్రలో జగన్ రెడ్డి తప్పించి మరెవ్వరూ లేరు. కుటుంబాలపై మాటల దాడి చేస్తుంటారు. మా తల్లిదండ్రులపై కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రబాబు గారి కుటుంబంపై వల్లభనేని వంశి దూషించారు. ఇటువంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకొని రాజకీయాలను, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ రెడ్డి. వెంటనే ఈ విషయంలో జగన్ రెడ్డి కలగజేసుకొని పేర్ని నాని చేత క్షమాపణలు చెప్పకపోతే వైసీపీ అనే పార్టీ తుడుచుపెట్టుకుపోతది. పద్ధతిగా ఉండి క్షమాపణలు చెప్పండి” అని డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షలు లేవు...  తప్పు చేస్తే శిక్ష తప్పుదు

చట్టం తనపని తాను రాజ్యాంగబద్ధంగా చేసుకుంటూపోతుంది. ఎటువంటి రాజకీయా కక్షలు మేము చేయడం లేదు. రాజకీయ విరుధిని అరెస్ట్ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఎంత స్థాయిలో ఉన్న చట్టం ముందు నించుపెడుతున్నాం. వారు శిక్ష అనుభవించడం తప్పదు. అది ప్రశన్నకుమార్ రెడ్డి అయినా, వల్లభనేని వంశి అయినా. వైసీపీ నాయకులు వారంతట వారే రొచ్చుగుంటలో దిగి ఏదిపడితే అది మాట్లాడుతూ జైలుకు పోయే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఒక మనిషిని నిన్ను చంపేస్తే దిక్కెవరు అనడం సెక్షన్ 307 కింద వచ్చినప్పుడు, రాత్రికి వేసేసి పగలు పరామర్శించండి అని పేర్ని నాని అన్న వ్యాఖ్యలు 307 సెక్షన్ కింద రాదా? ఇప్పుడు పేర్ని నానిని వదిలేస్తే అదే బాటలు మిగిలిన వైసీపీ నాయకులు కూడా మాట్లాడతారు" అని సోమిరెడ్డి ధ్వజమెత్తరు.
Perni Nani
Somireddy Chandramohan Reddy
Vallabhaneni Vamsi
Kodali Nani
TDP
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Mangalagiri

More Telugu News