Revanth Reddy: గోదావరి నీళ్లు ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams Opposition on Godavari Water Issue
  • తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి
  • రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమన్న రేవంత్ రెడ్డి
  • పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ కు సన్నబియ్యం ఆలోచన రాలేదని విమర్శలు
ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలితీర్చే ఆయుధమని అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం దండుగ కాదని, పండుగ అని చెప్పడానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినట్లు చెప్పారు. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు.

గతంలో మూడు రోజులు అధికారం ఇస్తే తుంగతుర్తికి జలాలు తీసుకువస్తామని చెప్పారని, కానీ పదేళ్లు అధికారంలో ఉండి దేవాదుల నుంచి నీళ్లు తేలేకపోయారని విమర్శించారు. 
Revanth Reddy
Telangana
Godavari River
Tungaturthi
Ration Cards
BRS
Nalgonda
Telangana History
Rice Production

More Telugu News