Anand Mahindra: నా కెరీర్ కు 44 ఏళ్లు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra Shares 44 Year Career Insights
  • తన అనుభవ సారాన్ని పంచుకున్న ఆనంద్ మహీంద్రా
  • ఏ కష్టం కూడా శాశ్వతం కాదని వెల్లడి
  • ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడో ఒకప్పుడు తొలగిపోక తప్పదని స్పష్టీకరణ
  • అంతటి తుపానుకు కూడా ముగింపు ఉంటుందని వివరణ
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కెరీర్ అనుభవాలను షేర్ చేస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు సమస్యలు శాశ్వతం కాదని ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. "నా కెరీర్ 44 సంవత్సరాలు పూర్తయింది. నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఘటనా శాశ్వతం కాదు. కష్టమైన సమయాలు, ఒత్తిడి, ఎదురుదెబ్బలు... అవన్నీ కూడా తొలగిపోతాయి. తుపాను మధ్యలో ఉన్నప్పుడు అది ఎప్పటికీ ముగియదేమో అనిపిస్తుంది... కానీ అంతటి తుపానుకు కూడా ముగింపు అనేది ఉంటుంది" అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

సవాళ్లకు వెనుదీయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఒత్తిడిని తొలగించుకోవాలని సలహా ఇచ్చారు."ఒత్తిడి మనల్ని బలహీనం చేస్తుంది. అలాంటప్పుడు మీ సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించండి, మీరు ఎంచుకున్న మార్గంలో స్థిరంగా కొనసాగండి... ఎప్పటికైనా పరిస్థితులు మారతాయని నమ్మండి... మీరు కోరుకున్నది కచ్చితంగా జరిగి తీరుతుంది" అని ఆయన జోడించారు. 
Anand Mahindra
Mahindra Group
Business Leader
Career Advice
Motivation
Inspiration
Hard Times
Challenges
Stress Management
Success

More Telugu News