Dan Dorsey: ఈ యాప్ తో ఇంటర్నెట్ లేకుండానే చాట్ చేయొచ్చట!

Dan Dorsey Launches Bit Chat Offline Messaging App
  • వాట్సాప్ కు పోటీ పడనున్న బిట్ చాట్ మెసేజింగ్ యాప్ 
  • ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా పని చేసే యాప్
  • బిట్ చాట్ పేరుతో ఈ మెసేజింగ్ యాప్ ను లాంఛ్ చేసిన ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు డాన్ డోర్సే
  • ప్రస్తుతం ఐ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన వైనం 
సెల్ ఫోన్ వినియోగదారులు తమ స్నేహితులు, సన్నిహితులు, బంధువులతో ఛాటింగ్ చేయడానికి వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి రకరకాల సోషల్ మీడియా యాప్స్ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యాప్స్ పనిచేయడానికి తప్పనిసరిగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి.

అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే చాటింగ్ సదుపాయం కలిగిన యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌తో ఇంటర్నెట్ లేకుండానే చాటింగ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డాన్ డోర్సే.. బిట్ చాట్ పేరుతో ఈ కొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రారంభించారు.

బిట్ చాట్ అనేది పీర్ – టు – పీర్ మెసేజింగ్ యాప్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇంటర్నెట్ అవసరం లేదు. ఎటువంటి కేంద్రీకృత సర్వర్, ఫోన్ నెట్ వర్క్ లేకుండా పనిచేస్తుంది. ఇది పూర్తిగా బ్లూటూత్ లో ఎనర్జీ నెట్ వర్క్ పై పనిచేస్తుంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వాట్సాప్‌తో ఈ యాప్ పోటీ పడనుంది. అయితే బిట్ చాట్ ప్రస్తుతం ఐ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఈ యాప్ ఉంది. అయితే ఈ యాప్ ఆండ్రాయిడ్‌కు ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై సదరు సంస్థ నుంచి ఎటువంటి సమాచారం లేదు. 
Dan Dorsey
Bit Chat
offline messaging app
bluetooth messaging
peer to peer messaging
whatsapp alternative
internet free chat
social media app
iPhone app

More Telugu News