YS Jagan: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భాంతి

YS Jagan Expresses Grief Over Annamayya District Road Accident
  • రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడ్ లారీ బోల్తా
  • మృతి చెందిన తొమ్మిది మంది కూలీలు
  • కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమన్న వైఎస్ జగన్
  • గాయపడిన వారికి ప్రభుత్వం మంచి వైద్యం అందేలా చూడాలన్న వైఎస్ జగన్
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం, రెడ్డివారిపల్లె చెరువు వద్ద మామిడికాయల లోడు లారీ బోల్తాపడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదంలో కూలీలు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఆ పేద కుటుంబాలకు అండగా నిలవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
YS Jagan
Annamayya district
Road accident
Andhra Pradesh
Obulavaripalle
Mamidi kayalu
YSRCP
Coolies death
Accident compensation
Andhra Pradesh news

More Telugu News