Chandrababu Naidu: రాయచోటి రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

CM Chandrababu Deeply Saddened by Rayachoti Road Accident
  • మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
  • మృతి చెందిన తొమ్మిది మంది కూలీలు 
  • ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లాలో రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంలో 9 మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు వీరు ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 
Chandrababu Naidu
Rayachoti road accident
Andhra Pradesh accident
Annamayya district
Road accident Andhra Pradesh
Pullampeta
Railway Koduru
Accident death toll
Andhra Pradesh news
AP CM

More Telugu News