Kota Srinivasa Rao: కోట భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన బ్రహ్మానందం.. ఓదార్చిన రాజేంద్రప్రసాద్!
- ఆదివారం ఉదయం కన్నుమూసిన కోట శ్రీనివాసరావు
- కోట నివాసానికి వెళ్లిన బ్రహ్మానందం
- కోట భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగాలకు లోనైన వైనం
ఎన్నో విజయవంతమైన చిత్రాలలో తనతో కలిసి నవ్వులు విరబూయించిన కోట శ్రీనివాసరావు విగతజీవుడిలా ఉండడం చూసి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తట్టుకోలేకపోయారు. కోట భౌతికకాయాన్ని ఉంచిన బాక్సుపై తల ఆనించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఉదయం కోట శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో, బ్రహ్మానందం తన చిరకాల మిత్రుడు కోట ఇంటికి వచ్చారు. కోట భౌతికకాయాన్ని చూడగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగాలకు లోనై రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ బ్రహ్మానందాన్ని ఓదార్చారు.