Kota Srinivasa Rao: కోట మృతిపై ప్రధాని మోదీ స్పందన
- ఆదివారం ఉదయం కన్నుమూసిన కోట శ్రీనివాసరావు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- తరతరాలుగా తన నటనతో ఆకట్టుకున్నారని కితాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోట మరణం పట్ల ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
"కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి" అంటూ మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కోట గతంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.