డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు మంటలు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
- తమిళనాడు తిరువల్లూరులోని చెన్నై-అరక్కోణం మార్గంలో ఘటన
- ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు ఘటన
- మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- ఆ మార్గంలో నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్స్ రైలులో పెద్ద ఎత్తున ఇంధనం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు చెన్నై-అరక్కోణం మార్గంలో అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.