Milk bath: విడాకులు వచ్చాయనే సంబరంతో పాలతో స్నానం చేసిన యువకుడు.. వీడియో ఇదిగో!

Assam Man Celebrates Divorce with Milk Bath After Wifes Affair
––
భార్యతో విభేదాల నేపథ్యంలో కోర్టుకెక్కిన ఓ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు తీర్పు విన్నాక ఇంటికి చేరుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేసి తాను ఇక స్వేచ్ఛాజీవినని సంతోషం వ్యక్తం చేశాడు. అస్సాంలోని నల్బాడీ జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన సదరు భర్త పేరు మాణిక్ అలీ.. విడాకులను పాల స్నానంతో అలీ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
ఎందుకింత సంబరం అని అడిగితే.. తన భార్య (మాజీ) కు ఓ ప్రియుడు ఉన్నాడని మాణిక్ అలీ చెప్పాడు. తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్ తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను, తన బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. ఒక్కసారి కాదు రెండుసార్లు అలాగే వెళ్లిపోయిందన్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు బిడ్డ కోసం తాను ఆమెను క్షమించానని చెప్పాడు.

మళ్లీ మళ్లీ అదే తప్పు చేయడంతో భరించలేక విడాకులు తీసుకున్నానని వివరించాడు. విడాకులు పొందాక కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందని, కొత్త జీవితం ప్రారంభానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని మాణిక్ అలీ చెప్పాడు.
Milk bath
Divorce
Assam
Manik Ali
Nalbari district
Extra marital affair
Mukalmua
Viral video
Family court

More Telugu News