Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధికను అందుకే టార్గెట్ చేశారు

Radhika Yadav targeted for lifestyle says friend
  • రాధికను కాల్చి చంపిన తండ్రి 
  • ఇంట్లో కఠిన ఆంక్షల మధ్య నలిగిపోయిందన్న స్నేహితురాలు హిమాన్షిక
  • తన ఇష్ట ప్రకారం జీవించడం వల్లే టార్గెట్‌గా మారిందని ఆవేదన
టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి కాల్చి చంపడంపై ఆమె ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ స్పందించింది. రాధిక తనకు 2012 నుంచి తెలుసని, ఆమె తరచూ షార్ట్స్ ధరించేదని, అబ్బాయిలతో మాట్లాడేదని, తన ఇష్టప్రకారం జీవించేదని గుర్తుచేసుకుంది. ఇవే ఆమెను టార్గెట్ చేశాయని, రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారని పేర్కొంది. బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారని గుర్తుచేసుకుంది. 

"ఆమె నాతో వీడియో కాల్‌లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆమె తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది" అని హిమాన్షిక పేర్కొంది."రాధికది సంప్రదాయ కుటుంబమని,  దాదాపు ప్రతిదానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడని హిమాన్షిక ఆవేదన వ్యక్తంచేసింది.
 
"అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు" అని పేర్కొంది. హిమాన్షిక తన ప్రాణ స్నేహితురాలిని, ఆమె ఎంతో మంచిదని వివరించింది. వీడియోలు చిత్రీకరించడం, ఫోటోలు తీయడాన్ని రాధిక ఇష్టపడుతుందని కూడా ఆమె చెప్పింది.

"క్రమంగా  వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. వారు చాలా సనాతనవాదులు" అని వివరించింది. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేదని హిమాన్షిక సింగ్ పేర్కొంది. 
Radhika Yadav
Radhika Yadav murder
tennis player
Himanshika Singh
honour killing
social pressure
conservative family
tennis academy
parental control
freedom

More Telugu News