Uppala Harika: ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: యాంకర్ శ్యామల

Uppala Harika Attack Condemned by Anchor Shyamala
  • రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్న శ్యామల
  • జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడి ఆందోళనకరమని వెల్లడి
  • మనం అటవిక రాజ్యంలో ఉన్నామా అంటూ ట్వీట్
కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని చెప్పేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని విమర్శించారు. గంటన్నర సేపు మీటింగ్‌కు హాజరుకాకుండా అడ్డుకున్నారని, రోడ్డుపై కారును ఆపేసి అద్దాలను పగలగొట్టారని శ్యామల ఆరోపించారు. ఒక జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న హారికపై ఈ దారుణ చర్య జరిగడం ఆందోళనకరమని తెలిపారు.

"ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా... లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా...! ఒక బీసీ మహిళపై చేసినటువంటి ఈ దాడిని కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నర సేపు మీటింగ్ కి రానివ్వకుండా, రోడ్డుమీద ఆపేసి, కారు అద్దాలు పగలగొట్టి,  ఒక జిల్లా ప్రథమ పౌరురాలు అయిన జడ్పీ చైర్ పర్సన్ పై మీరు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఇంక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి...? రాష్ట్రంలో, జిల్లాల్లో మహిళల పట్ల మీ ప్రభుత్వ తీరు మరొకసారి మీరు నిరూపించుకున్నారు. మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళలను మీరు ఎంత చులకనగా చూస్తున్నారో అన్నదానికి ఇదే ఒక ఉదాహరణ. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ గారూ... మీ పాలనలో మహిళల పట్ల మీరు ప్రవర్తించే తీరు న భూతో న భవిష్యత్" అంటూ శ్యామల ట్వీట్ చేశారు.
Uppala Harika
Anchor Shyamala
Andhra Pradesh
Krishna District
Zilla Parishad Chairperson
YS Jagan Mohan Reddy
TDP
Attack Condemnation
Political Violence
BC Women

More Telugu News