Perni Nani: "చీకట్లో" వ్యాఖ్యల ఫలితం... పేర్ని నానిపై కేసు నమోదు

Perni Nani Booked After Controversial Comments
  • చిక్కుల్లో పడిన వైసీపీ నేత పేర్ని నాని
  • టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదుతో అవనిగడ్డలో కేసు నమోదు
  • వైసీపీ సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని
  • రెచ్చగొట్టేలా ఉన్నాయంటున్న టీడీపీ నేతలు
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ సమావేశాల్లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ కేసుకు కారణం. టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు.

పేర్ని నాని తన ప్రసంగంలో, "రప్పా రప్పా అని కేకలు వేయడం కాదు... చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. ఏదైనా చేయాలంటే నిశ్శబ్దంగా చేయండి, అరవకండి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను రహస్యంగా రాజకీయ హింసకు ప్రోత్సాహించేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను పెంచి, హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

కనపర్తి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్ని నానిని 'రైస్ స్కామ్‌స్టర్'గా పేర్కొన్నారు, ఆయన వ్యాఖ్యలు సమాజంలో అరాచకాన్ని సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

Perni Nani
Perni Nani case
Avinagadda
YSRCP
TDP
Kanaparthi Srinivasa Rao
Andhra Pradesh politics
Political controversy
Rice scamster
Political violence

More Telugu News