K Kesava Rao: కె. కేశవరావు ఏం మాట్లాడుతున్నారో.. కాంగ్రెస్‌లోకి వెళ్లాకే అలా తయారయ్యారు: శ్రీనివాస్ గౌడ్

K Kesava Rao Changed After Joining Congress Says Srinivas Goud
  • బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్
  • విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
  • ప్రభుత్వం తప్పు చేస్తున్నా సహకరించాలా అని నిలదీత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాకే ఆయన అలా తయారయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్సు వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులకు అవగాహన లేదని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్సు ఎందుకు ఇవ్వడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎలాంటి చిక్కులు లేకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ మొదటి నుండి డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ అంశంపై కేశవరావు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలను ఏమీ అనలేక ఆయన బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వానికి సహకరించాలని కె. కేశవరావు చెబుతున్నారని, కానీ తప్పు చేస్తుంటే కూడా సహకరించాలా? అని ఆయన ప్రశ్నించారు.
K Kesava Rao
Srinivas Goud
BRS
Telangana
BC Reservations
Congress Party

More Telugu News