Bode Prasad: పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా అది మరోసారి స్పష్టమయింది: బోడె ప్రసాద్

Bode Prasad Comments on Perni Nani Remarks
  • రప్పా రప్పా ప్లకార్డును జగన్ సమర్థించారన్న బోడె ప్రసాద్
  • తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపాటు
  • అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగుతున్నారని వ్యాఖ్య
పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త రప్పా రప్పా అనే ప్లకార్డు పట్టుకుంటే... మీడియా సమక్షంలో దాన్ని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. మాజీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా ప్రజాప్రతినిధులకు జగన్ ఇచ్చే స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ్నించారు. 

చీకట్లో కన్నుకొడితే పనైపోవాలని, తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారని... వైసీపీ నేతలు మాత్రం తలలు నరకండి, హత్యలు చేయండి అని చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమయిందని చెప్పారు. అవినీతి సొమ్ముతో నాని విర్రవీగి వ్యవహరిస్తున్నారని... గత ఎన్నికల ఫలితాలను గుర్తుంచుకోవాలని అన్నారు.
Bode Prasad
YSRCP
TDP
Jagan Mohan Reddy
Perni Nani
Andhra Pradesh Politics
Palnadu District
Rappa Rappa
Chandrababu Naidu

More Telugu News