Mohan Babu: 'కన్నప్ప' సినిమాపై ట్రోలింగ్స్ కు సంబంధించి మోహన్ బాబు స్పందన

Mohan Babu Responds to Trolls on Kannappa Movie
  • సినిమాకు విమర్శ-సద్విమర్శ రెండూ ఉంటాయన్న మోహన్ బాబు
  • మిమ్మల్ని విమర్శించేవాళ్లు మీ కర్మను తీసుకెళుతున్నారని ఒక గొప్ప పండితుడు చెప్పారని వ్యాఖ్య
  • ట్రోల్స్ చేసే వారి గురించి ఏమీ మాట్లాడబోనన్న మోహన్ బాబు
మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప' చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై మోహన్ బాబు స్పందించారు.

"సినిమాకు విమర్శ-సద్విమర్శ రెండూ ఉంటాయి. గొప్ప పండితుడు, వేద శాస్త్రాలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు. మోహన్ బాబు గారూ... జరిగేదంతా చూస్తున్నా. గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ మీరు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే... మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్లంతా మీ కర్మను తీసుకెళుతున్నారు. కాబట్టి వాళ్లను ఆశీర్వదించండి అని చెప్పారు. వాళ్ల గురించి నేను ఏమీ మాట్లాడను. వాళ్ల కుటుంబాలు, అమ్మానాన్నలు బాగుండాలని కోరుకుంటున్నా" అని మోహన్ బాబు చెప్పారు.
 
Mohan Babu
Kannappa Movie
Manchu Vishnu
Prabhas
Mohanlal
Trolls
Movie Criticism
Telugu Cinema

More Telugu News