KA Paul: నా కుమారుడు అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది నా కోరిక: కేఏ పాల్

KA Paul Wants His Son To Be US President
  • తన కుమారుడు అమెరికాలో పుట్టి పెరిగాడన్న పాల్
  • మస్క్ తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని వ్యాఖ్య
  • నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని విన్నపం
అమెరికాను కాపాడేందుకు మూడో పార్టీ కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మస్క్ తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని చెప్పారు. మస్క్ దగ్గర డబ్బు ఉంది, తనకు ఫాలోయింగ్ ఉందని అన్నారు. తన కుమారుడు అమెరికాలోనే పుట్టి పెరిగాడని... తన కుమారుడు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలనేదే తన కోరిక అని చెప్పారు.

యెమెన్ లో పని చేస్తున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షపైనా కేఏ పాల్ స్పందించారు. ఈ నెల 16న ఆమెకు శిక్షను అమలు చేయబోతున్నారు. తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని 2017లో ఆమె హత్య చేశారు. 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఫైనల్ అప్పీల్ 2023లో రిజెక్ట్ అయింది. ఆమెకు క్షమాభిక్షను ప్రసాదించాలని పాల్ కోరారు.

నిమిష ప్రియకు క్షమాభిక్ష పెట్టాలని యెమెన్ ప్రధానికి లేఖ రాశానని పాల్ తెలిపారు. ప్రియ ఎన్నో కష్టాలు పడిందని... ఆమె బిజినెస్ పార్ట్ నర్ ఆమెకు నరకం చూపించాడని చెప్పారు. ఆయన నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆయనను హత్య చేసిందని... ఆమె చేసిన హత్యను ఖండిస్తున్నానని... కానీ, ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఆమెకు క్షమాభిక్ష పెడితే యెమెన్ ప్రెసిడెంట్ ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని చెప్పారు. యెమెన్ లో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు.


KA Paul
Nimisha Priya
Yemen
Kerala Nurse
Murder Case
Pardoning
US President
Elon Musk
Nobel Peace Prize
Praja Shanti Party

More Telugu News