Elon Musk: భారత్ లో 'ఎక్స్' వినియోగదారులకు గుడ్ న్యూస్

Elon Musk X Subscription Prices Reduced in India
  • సబ్ స్క్రిప్షన్ ధరలతో ఇబ్బంది పడుతున్న ఎక్స్ వినియోగదారులు
  • కీలక నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్
  • సబ్ స్క్రిప్షన్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం
ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఖాతాలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు. 

తాజా నిర్ణయం ప్రకారం... నెలకు రూ. 5,130గా ఉన్న ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ధర రూ. 3 వేలకు అందుబాటులోకి రానుంది. రూ. 900గా ఉన్న ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర రూ. 470కి తగ్గనుంది.

యాప్ వర్షన్ లో బేసిక్ ప్లాన్ నెలకు రూ. 244గా ఉన్న ధర రూ. 170కి... ప్రీమియం రూ. 650 నుంచి రూ. 427కి... ప్రీమియం ప్లస్ రూ. 3,470 నుంచి రూ. 2,570కి దిగిరానున్నాయి.
Elon Musk
X
Twitter
X Premium
Twitter Blue
Social Media
Subscription Price
India
Tech News
Business

More Telugu News