మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించిన డైరెక్టర్ శంకర్
- తదుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన శంకర్
- 'వేల్పారి' తన తదుపరి ప్రాజెక్ట్ అని వెల్లడి
- భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ అవసరమవుతాయన్న శంకర్
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో శంకర్ మాట్లాడుతూ... ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రోబో' అని చెప్పారు. ఇప్పుడు 'వేల్పారి' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుందని... ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి అవుతుందని చెప్పారు. ఈ సినిమాకు భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ అవసరమవుతాయని తెలిపారు. 'అవతార్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికతను పరిచయం చేయనున్నారు. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుందని... తన కల త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు.