విమానం టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్‌లు ఆఫ్!
- అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి
- ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశావంటూ మరో పైలట్‌ను ప్రశ్నించిన పైలట్
- కాక్‌పిట్‌లో రికార్డయిన చివరి మాటలు ఇవే
- ఏఏఐబీ దర్యాప్తు నివేదికలో వెల్లడి
పైలట్లు ఇచ్చిన మేడే కాల్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఈలోపే విమానం కూలిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తిచేసినట్టు తెలిపింది. అలాగే, విమానానికి సంబంధించిన రెండు ఇంజిన్లను వెలికి తీసినట్టు పేర్కొంది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లో ఉన్నాయని వివరించింది. అలాగే, విమానంలో ప్రమాదకర వస్తువులు ఏమీ లేవని ఏఏఐబీ తన నివేదికలో పేర్కొంది.