సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత
- శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో ఇటీవల మెగా పీటీఎంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, నారా లోకేశ్
- సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన తల్లికి వందనం లబ్దిదారురాలు మాధవి
- మాధవి పిల్లలు అడగడంతో సైకిళ్లు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం
తల్లికి వందనం పథకం కింద మాధవికి నలుగురు పిల్లల కోసం రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మాధవి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆ సమయంలో తమకు సైకిళ్లు కావాలని మాధవి పిల్లలు ముఖ్యమంత్రిని కోరారు.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నలుగురికి సైకిళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సూచనలతో అధికారులు వారి ఇంటికి వెళ్లి నాలుగు సైకిళ్లను అందజేశారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు.