Dola Sri Bala Veeranjaneya Swamy: నర్సింగ్ చదివిన ఎస్సీ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

Good News for SC Nursing Graduates from AP Government
  • నర్సింగ్, GNM చదివిన ఎస్సీ యువతకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నామన్న మంత్రి డోలా
  • మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి 
  • ఎస్సీల్లో చదువుకున్న ఏ ఒక్కరూ ఉద్యోగ,ఉపాధి లేమితో ఉండకూడదన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడి
నర్సింగ్ విద్య పూర్తి చేసిన ఎస్సీ నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నర్సింగ్ మరియు జీఎన్ఎం చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

ఎస్సీ యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. నర్సింగ్, జీఎన్ఎం చదివిన ఎస్సీ యువతకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి, అనంతరం వారికి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఎస్సీలలో విద్యావంతులైన ఏ ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి లేమితో ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఎస్సీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుపడుతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. 
Dola Sri Bala Veeranjaneya Swamy
AP Government
Andhra Pradesh
SC Youth
Nursing Jobs
German Language Training
Free Training
Chandrababu Naidu
SC Corporation
Employment Opportunities

More Telugu News