Kiriti: 'జూనియర్ ' ట్రైలర్ లాంచ్... చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రాజమౌళి

Kiriti Junior Trailer Launched Rajamouli Wishes Team Best
  • హీరోగా పరిచయం అవుతున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి
  • కిరీటి, శ్రీలీల జంటగా 'జూనియర్'
  • రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
  • జులై 18న రిలీజ్ అవుతున్న చిత్రం
  • నేడు ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి
కర్ణాటక రాజకీయ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి టాలీవుడ్ లో వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరీటి సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన గీతం యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం జులై 18న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.

తాజాగా అగ్ర దర్శకుడు రాజమౌళి జూనియర్ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. జూనియర్ చిత్ర బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం కలిగిస్తోందని, ఈ తొలి చిత్రంతో కిరిటీకి విజయం దక్కాలని కోరుకుంటున్నానని తెలిపారు. జులై 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ వీడియోను పంచుకున్నారు. 

కాగా, వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఇందులో కన్నడ సీనియర్ నటుడు వి.రవిచంద్రన్ ఓ కీలకపాత్ర పోఫిస్తుండడం విశేషం. ఇందులో ఇంకా జెనీలియా, రావు రమేశ్, సుధారాణి, అచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష తదితరులు నటిస్తున్నారు. 
Kiriti
Junior movie
Sreeleela
Rajamouli
Gali Janardhan Reddy
Radhakrishna Reddy
Devi Sri Prasad
Telugu movie trailer
Varahi Chalana Chitram

More Telugu News