Siddaramaiah: సిద్ధరామయ్యను అవమానిస్తారా?: రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం

BJP Slams Rahul Gandhi Over Siddaramaiah Appointment Denial
  • ఢిల్లీకి వచ్చిన సిద్ధరామయ్యకు దొరకని రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్
  • సొంత పార్టీ నేత, సీఎంను అవమానించారని బీజేపీ విమర్శలు
  • గాంధీ కుటుంబం కర్ణాటక కాంగ్రెస్ నేతలను గతంలోనూ అవమానించిందని ఆరోపణ
సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వచ్చి అపాయింట్‌మెంట్ కోరితే కలవకుండా అవమానిస్తారా? అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో కొంతకాలంగా అధికార మార్పిడిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఢిల్లీకి వచ్చారు. రాహుల్ గాంధీని కలవాలని ప్రయత్నించగా ఆయనకు అపాయింట్‌మెంట్ లభించలేదు.

ఈ అంశంపై బీజేపీ స్పందిస్తూ, "మీ పార్టీ నేత, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని కలిసేందుకు ఢిల్లీ వరకు వస్తే ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానిస్తారా?" అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులను గాంధీ కుటుంబం అవమానించడం ఇదే మొదటిసారి కాదని ఆయన ఆరోపించారు. గతంలో వీరేంద్ర పాటిల్‌ను రాజీవ్ గాంధీ అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి అవమానించారని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు సిద్ధరామయ్యపై కుట్ర పన్ని డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కోవాలని చూస్తున్నప్పటికీ, రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంపై ఆయనతో చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా అవమానించారని విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశమయ్యారు. అయితే, సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ మాత్రం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది
Siddaramaiah
Rahul Gandhi
DK Shivakumar
Karnataka politics
Congress party
BJP
Chief Minister

More Telugu News