Renuka Chowdhury: రేణుకా చౌదరిపై నమోదైన కేసును కొట్టివేసిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

Court Dismisses Case Against Renuka Chowdhury
  • ఖమ్మం కోర్టులో రేణుకా చౌదరికి ఊరట
  • ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేశారంటూ కళావతి ఫిర్యాదు
  • ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేసిన జడ్జి
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది. 

కేసు వివరాల్లోకి వెళితే... 2014లో తనకు, లేదా తన భర్తకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి రేణుకా చౌదరి మోసం చేశారంటూ భూక్య రాంజీ భార్య కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. అయితే రేణుకపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పును వెలువరించారు. రేణుక తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు. 
Renuka Chowdhury
Renuka Chowdhury case
SC ST court
Khammam court
Bhukya Ramji
Kalavathi
వైరా MLA ticket
Telangana Congress
Atrocity case

More Telugu News