Kubera: ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైన 'కుబేర'

Kubera Movie Ready for OTT Streaming
  • ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన చిత్రం కుబేర
  • శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం
  • జూన్ 20న ప్రేక్షకుల ముందుకు!
  • జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా కుబేర. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రైమ్ డ్రామా చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. కలెక్షన్ల పరంగానూ ఫర్వాలేదనిపించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. కుబేర చిత్రం జులై 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ ప్రకటన చేసింది. 


కుబేర చిత్రంలో ముఖ్యంగా ధనుష్ నటన వావ్ అనిపించేలా సాగింది. నాగార్జున డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం, శేఖర్ కమ్ముల టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రాన్ని మరో లెవల్ కు చేర్చాయి. తన కెరీర్ లో ఇప్పటివరకు బెస్ట్  ఏదంటే కుబేర చిత్రం అనే చెబుతానని శేఖర్ కమ్ముల ఇటీవల వెల్లడించారు.



Kubera
Dhanush
Nagarjuna
Rashmika Mandanna
Sekhar Kammula
Amazon Prime Video
Telugu Movie
OTT Streaming
Crime Drama
Devi Sri Prasad

More Telugu News