రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై ఫోకస్ పెట్టాం: చంద్రబాబు
- మన దేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు జనాభానే అన్న చంద్రబాబు
- అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62 శాతమేనన్న సీఎం
- జనాభా పెరుగుదలను తాను సమర్థిస్తున్నానని వ్యాఖ్య
ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారని... ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు గౌరవం దక్కుతోందని చంద్రబాబు అన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే... స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదనే చట్టాన్ని తాను తీసుకొచ్చానని... ఇప్పుడు జనాభా పెరుగుదలను తానే సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.