Bhagwant Mann: 10 వేల జనాభా ఉన్న దేశాలకు కూడా వెళ్తున్నారు: మోదీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు

Punjab CM Bhagwant Mann Slams Modis Foreign Visits
  • ఏయే దేశాలకు వెళుతున్నారో మోదీకే తెలియడం లేదన్న మాన్
  • చిన్న దేశాల్లో ఆయనకు అత్యున్నత పురస్కారాలు అందుతున్నాయని ఎద్దేవా
  • మాన్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ఆగ్రహం
ప్రధాని మోదీ ఇటీవలే ఐదు దేశాల విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ... మోదీ ఏయే దేశాలకు వెళుతున్నారో ఆయనకే తెలియాలని అన్నారు. ఘనా అని చెప్పి ఎక్కడికో వెళ్లారని విమర్శించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉండకుండా... 10 వేల మంది జనాభా ఉన్న దేశాలకు వెళుతున్నారని... అక్కడ ఆయనకు అత్యున్నత పురస్కారాలు అందుతున్నాయని ఎద్దేవా చేశారు.

భగవంత్ మాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని విదేశీ పర్యటనలపై రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని మాన్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు వారి స్థాయిని తగ్గిస్తాయని పేర్కొంది. భారత్ తో స్నేహంగా ఉండే దేశాలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని సూచించింది.
Bhagwant Mann
Narendra Modi
Modi Foreign Visits
Punjab CM
Indian Foreign Policy
MEA Response
Ghana
International Relations
Political Criticism

More Telugu News