Kallu: కల్లులో ఆల్ఫ్రాజోలం కలిపిన పలు దుకాణాల లైసెన్స్ రద్దు

Kallu Shops License Cancelled for Alprazolam Adulteration in Hyderabad
  • కూకట్‌పల్లి పరిధిలో జరిగిన ఘటనతో ఎక్సైజ్ శాఖ విస్తృత తనిఖీలు
  • కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు
  • లైసెన్స్ రద్దు చేసినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు వెల్లడి
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పరిధిలో చోటుచేసుకున్న కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడిన ఎక్సైజ్ శాఖ అధికారులు పలు కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించారు. నారాయణగూడలోని ప్రయోగశాలలో ఈ పరీక్షలు జరిగాయి.

కొన్ని కల్లు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం మత్తు మందును కలిపి కల్తీ కల్లును తయారు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. కల్తీ కల్లును తయారు చేసిన పలు దుకాణాల లైసెన్సులను రద్దు చేసినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
Kallu
Hyderabad
Alprazolam
Excise Department
Adulterated Kallu
Kukatpally

More Telugu News