Pawan Kalyan: పవన్ కల్యాణ్, బాలకృష్ణ బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేశారు: కేఏ పాల్

KA Paul Alleges Pawan Kalyan Balakrishna Promoted Betting Apps
  • పవన్, బాలకృష్ణలపై విచారణ ఎందుకు జరపడం లేదని కేఏ పాల్ ప్రశ్న
  • బీజేపీతో పొత్తు వల్లే దర్యాప్తు సంస్థలు మౌనం వహిస్తున్నాయని విమర్శ
  • రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని మండిపాటు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలను లక్ష్యంగా చేసుకుని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్, బాలకృష్ణ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని ఆరోపించిన ఆయన, వారిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్, ఆయన సోదరులు, బాలకృష్ణ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయలేదా?" అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నందునే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

"బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వారిపై విచారణలు ఉండవా? వాళ్ల మీద ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగవా?" అంటూ ఆయన నిలదీశారు. బీజేపీతో కలిస్తే పద్మభూషణ్‌లు ఇచ్చి చాలా శుభ్రంగా కాపాడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దౌర్జన్యం, అవినీతి పెరిగిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయని కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
Pawan Kalyan
Balakrishna
KA Paul
Betting Apps
AP Politics
TDP
Janasena
BJP Alliance
Corruption
Investigation

More Telugu News