Jyothi Krishna: పవన్ చేతుల్లో నా కూతురు.. నాకో వరం: 'హరిహర వీరమల్లు' దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

Hari Hara Veera Mallu Directors Touching Post About Pawan Kalyan
  • పవన్ కల్యాణ్ పై దర్శకుడు జ్యోతికృష్ణ భావోద్వేగ పోస్ట్
  • తన కుమార్తెను పవన్ ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసిన జ్యోతికృష్ణ
  • ఈ ఫొటో జీవితకాలం గుర్తుంచుకునేదని వ్యాఖ్య
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘హరిహర వీరమల్లు’ చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఓ అపురూపమైన ఫొటోను పంచుకుంటూ, అది తన హృదయానికి ఎంతో దగ్గరైందని తెలిపారు. ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, జ్యోతికృష్ణ తన తండ్రి, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం, తన భార్యతో కలిసి పవన్ ను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలో పవన్ కల్యాణ్.. జ్యోతికృష్ణ కుమార్తె అహానాను ఎత్తుకుని కనిపించారు. తన కుమార్తె మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోను 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "నా హృదయానికి ఎప్పటికీ దగ్గరగా ఉండే ఫొటో ఇది. కేవలం వృత్తిపరమైన జ్ఞాపకం మాత్రమే కాదు, జీవితకాలం గుర్తుంచుకునేది" అని రాసుకొచ్చారు.

పవన్ పై తనకున్న గౌరవాన్ని వివరిస్తూ, "ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి పక్కన ‘హరిహర వీరమల్లు’ దర్శకుడిగా నిల్చోవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సినిమా గొప్పతనాన్ని, దాని పట్ల చూపించాల్సిన నిబద్ధతను తెలిపి, నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. ఈ ఫొటోలో నా కుటుంబం ఉంది. పవన్ గారి చేతుల్లో నా కుమార్తె అహానా ఉంది. కొన్ని ఫొటోలు కథలుగా మారతాయి. కానీ ఇది నాకు వరం లాంటిది" అని జ్యోతికృష్ణ పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకుడు క్రిష్ మధ్యలో వదిలివెళ్లిన 'హరిహర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను, తన తండ్రి ఏఎం రత్నం కోరిక మేరకు జ్యోతికృష్ణ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఏఎం రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 
Jyothi Krishna
Pawan Kalyan
Hari Hara Veera Mallu
AM Ratnam
Ahaana
AP Deputy CM
Telugu cinema
Tollywood
Director
Movie release

More Telugu News