Jagan Mohan Reddy: పోలీసులకు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

Jagan Mohan Reddy Warns Police
  • రైతుల పట్ల పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ జగన్
  • ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని పోలీసులకు హెచ్చరిక
  • రాబోయేది జగన్ ప్రభుత్వమనేది గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
"ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. ఈ విషయం గుర్తుంచుకోండి" అంటూ హెచ్చరికలు జారీ చేశారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రైతుల తలలు పగలగొడతారా? 1,200 మందిని జైళ్లలో పెడతారా? అసలు రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?" అంటూ జగన్ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. రైతులను రౌడీ షీటర్లలా పరిగణిస్తూ దురుసుగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రలోభాలకు, ఇచ్చే లంచాలకు లొంగవద్దని పోలీసులకు హితవు పలికారు.

"రేపు ఇదే చంద్రబాబు మిమ్మల్ని కూడా మోసం చేయొచ్చు. అప్పుడు మీ తరఫున పోరాటం చేయాల్సి వచ్చేది కూడా నేనే" అని జగన్ అన్నారు. కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, వారి పక్షాన నిలబడతానని భరోసా ఇచ్చారు. జగన్ పర్యటనతో బంగారుపాళ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 
Jagan Mohan Reddy
Jagan
Andhra Pradesh
Chittoor District
Mango Farmers
Police Warning
Chandrababu Naidu
Bangarupalyam
Farmers Protest
YS Jagan
Telugu News

More Telugu News