Sagar: అదే నేను చేసిన పొరపాటు: హీరో సాగర్

Sagar Interview
  • 'ది 100' మూవీతో వస్తున్న సాగర్ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ షురూ 
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
  • ఈ నెల 11వ తేదీన సినిమా విడుదల  
  • 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీ గురించిన ప్రస్తావన

బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న చాలామంది, ఆ తరువాత వెండితెర దిశగా అడుగులు వేశారు. ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది. అయితే అలా సీరియల్స్ వైపు నుంచి సినిమాల దిశగా వెళ్లినవారు అక్కడ ఎక్కువ కాలం పాటు పోరాడలేక వెనుదిరిగినవారే ఎక్కువ. కానీ హీరో సాగర్ విషయానికి వస్తే, పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ఆయన తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. అందువల్లనే ఆయన నుంచి 'ది 100' అనే మూవీ రాబోతోంది. ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమా దిగబోతోంది. 

బుల్లితెరపై పోలీస్ పాత్రలకి పెట్టింది పేరుగా సాగర్ కనిపిస్తాడు. వెండితెరపై కూడా అదే జోరును కొనసాగించడానికి ఆయన చేసిన ప్రయత్నంగా 'ది 100' కనిపిస్తుంది. రమేశ్ కరుటూరి -వెంకీ పూశడపు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాతో, రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో సాగర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆవేశం .. ఆదర్శం పుష్కలంగా కనిపించే పాత్ర ఇది. వినోదం .. సందేశం కలగలిసిన కంటెంట్ ఇది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో సాగర్ మాట్లాడుతూ .. " నేను ఇక వెండితెరపైనే కనిపించాలని నిర్ణయించుకున్నప్పుడు, నాకు 'మిస్టర్ పెర్ఫెక్ట్'లో ఒక ముఖ్యమైన పాత్రను చేసే ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ తరువాత స్థానంలో నా పాత్రకి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కానీ అందులో వాస్తవం లేదని షూటింగు సమయంలోనే నాకు అర్థమైంది. దర్శకుడిని అడిగితే సరైన సమాధానం రాలేదు. దాంతో నేను మధ్యలోనే మానేశాను. అయినా ఆ పాత్రను వాళ్లు అలాగే ఉంచారు. ఆ సినిమాలో ఆ పాత్ర చేయకుండా ఉండవలసిందని నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పాడు.

Sagar
Hero Sagar
The 100 Movie
Telugu cinema
Telugu movies
Ramesh Karuturi
Raghav Omkar Shashidhar
Mr Perfect movie
Prabhas
Telugu Film Industry

More Telugu News