Chalam: అప్పట్లో హీరో చలాన్ని మందలించిన ఎన్టీఆర్!

Nandam Harishchandra Rao Interview
  • హీరోగా మారిన మొదటి కమెడియన్ చలం 
  • వరుస హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు 
  • నిర్మాతగా చివరిదశలో నష్టాలు
  • శారదను చాలా ఇబ్బందిపెట్టాడన్న హరిశ్చంద్రరావు  

తెలుగు తెరపై చలం స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు బరిలో ఉండగానే చలం తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్లారు. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు వరుసగా భారీ విజయాలను నమోదు చేస్తూ వెళ్లాయి. ఆయన ఎంచుకునే కథలు .. ఆ సినిమాల్లోని పాటలు గొప్పగా ఉంటాయనే ఒక నమ్మకం ఆడియన్స్ లో ఏర్పడిపోయింది. దాంతో ఆయన సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోగా కొనసాగారు. 

అలాంటి చలం గురించి సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు మాట్లాడుతూ, "చలం గారు చాలా చిన్న చిన్న వేషాలు వేస్తూ హీరోగా ఎదిగారు. కమెడియన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన మొదటి ఆర్టిస్ట్ ఆయనే. ఆయన ఒక జమిందారుగారి మనవరాలిని వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆయనకి బాగా కలిసొచ్చింది. ఆమె చనిపోయిన తరువాత, ఆయన కాస్త డీలాపడ్డారు. ఆ సమయంలోనే ఆయన శారదను వివాహం చేసుకున్నారు" అని అన్నారు. 

"శారదగారితో కలిసి నటిస్తూ .. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. షూటింగులు జరుగుతున్న చోటుకి వెళ్లి ఆమెతో గొడవపడేవారు. ఒకసారి సెట్లోనే ఉన్న ఎన్టీ రామారావుగారు, పద్ధతి మార్చుకోమని చలానికి వార్నింగ్ ఇచ్చారని అంటారు. అలాంటి పరిస్థితుల్లోనే శారదగారు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆయన మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు" అని చెప్పారు.

Chalam
NTR
NT Rama Rao
Sarada
Telugu cinema
Tollywood
Nandam Harishchandra Rao
Hero Chalam
Telugu film industry
Shoban Babu

More Telugu News